ఖమ్మంలో అక్రమ దత్తత యత్నాన్ని అడ్డుకున్న అధికారులు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా చైర్మన్ పుచ్చకాయల దేవేందర్ కుమార్ చొరవతో అక్రమ దత్తత వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మౌనిక, యుగంధర్ దంపతులు తమ పసికందును మరో దంపతులకు దత్తత ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. సీడబ్ల్యూసీ విచారణ అనంతరం పాపను కన్న తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.