మైసిగండిలో రికార్డు ధర పలికిన వినాయకుని లడ్డూ వేలంపాట

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో ప్రతిష్టించిన వినాయకుని లడ్డూలు రికార్డు ధరలు పలికాయి. బుధవారం నిర్వహించిన వేలంపాటలో గ్రామంలోని పెద్ద వినాయకుని లడ్డును నాలుగు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల రూపాయలకు దీపావత్ అనిల్ కుమార్, విజయ్ కుమార్ దక్కించుకున్నారు. వివిధ మండపాల లడ్డూలను భక్తులు కైవసం చేసుకుని గణనాధులను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. పీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ పద్మశ్రీ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.