ఢిల్లీలో పోలీసుల లాఠీఛార్జ్ శిక్షణ: సోషల్ మీడియాలో కనిపించకుండా కొట్టాలని సూచన

రిపోర్టర్: విజయ్ స్థలం: New Delhi

ఢిల్లీలో జరుగుతున్న నిరసనల సమయంలో సోషల్ మీడియాలో వీడియోలు రాకుండా లాఠీని ఎలా ఉపయోగించాలో ఒక పోలీసు అధికారి తన కిందిస్థాయి సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు ది న్యూస్ మినిట్ (The News Minute) వెల్లడించింది. లాఠీని ఎక్కువగా పైకి ఎత్తకుండా పక్క నుంచి కొట్టాలని ఆయన సూచించినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాల వల్లే తాము బలవంతంగా కొన్ని పనులు చేయాల్సి వస్తోందని పోలీసు సిబ్బంది తమతో చెబుతున్నట్లు యూట్యూబ్ ఇంటర్వ్యూలో వెల్లడైందని తెలిపారు.