జీహెచ్ఎంసీ వార్షిక క్రీడల్లో దుమ్మురేపి చాంపియన్‌షిప్ కొట్టిన హెడ్ ఆఫీస్
రిపోర్టర్: saikiran
స్థలం: రాజేంద్రనగర్
ఐదు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన జీహెచ్ఎంసీ వార్షిక క్రీడా పోటీలు ముగిశాయి. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. కమిషనర్ విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఉద్యోగులు శారీరక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణకు నిత్యం క్రీడలను తమ దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు.