నగరిలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే
రిపోర్టర్: katikapalli perumal
స్థలం: నగరి
చిత్తూరు జిల్లా నగరి వి కేర్ పురం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే భాను ప్రకాష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భజనలు చేస్తూ, ఉట్టికొట్టే కార్యక్రమంలో ఆయన ప్రత్యేకంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీకృష్ణుని వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. వేడుకల సందర్భంగా ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.