ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న డీజీపీ సి.వి. ఆనంద్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ స్వామిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేసిన నాటి నుంచే ఈ ఉత్సవాలతో తనకు 13 ఏళ్ల అనుబంధం ఉందని డీజీపీ గుర్తుచేసుకున్నారు. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీస్ శాఖ వెల్లడించింది.