గువహతిలో దారుణం: పబ్ లో మహిళపై దాడి చేసి బట్టలు విప్పిన వైనం

రిపోర్టర్: గోపి స్థలం: Guwahati

అస్సాం రాష్ట్రంలోని గువహతి నగరంలో ఒక మహిళపై తీవ్ర దాడి జరిగినట్లు డిసిపి తబు రామ్ పెగు వెల్లడించారు. ఖనాపారా ప్రాంతంలోని ఒక పబ్ లో అర్ధరాత్రి మహిళను వివస్త్రను చేసి కొట్టినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు పబ్ మేనేజర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలి వివరాలను సేకరిస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.