నేటితో ముగియనున్న మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ నేటితో ముగియనుంది. గోదాముల్లో నిల్వలు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ముందస్తుగా పంపిణీ చేసిన ఈ కోటాను, ఇంకా తీసుకోని లబ్ధిదారులు ఇవాళ సాయంత్రంలోపు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. గడువు ముగిశాక పాత కోటా పొందే అవకాశం ఉండదని, సాంకేతిక సమస్యలుంటే డీలర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.