ఏపీ హైకోర్టుకు ఐదుగురు శాశ్వత జడ్జిల నియామకానికి కొలీజియం సిఫారసు
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా సేవలందిస్తున్న ఐదుగురిని శాశ్వత జడ్జిలుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. ఈ మేరకు జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ చంద్రధనశేఖర్, జస్టిస్ గుణరంజన్, జస్టిస్ హరిహరనాథ శర్మ, జస్టిస్ యడవల్లి లక్ష్మణరావుల పేర్లను సిఫారసు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. న్యాయవ్యవస్థలో పారదర్శకతను మరింత విస్తృతం చేసేలా ఈ నిర్ణయం తీసుకోగా, త్వరలోనే కేంద్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది.