సూర్యాపేట జిల్లాలోని తన స్వగ్రామంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన

రిపోర్టర్: రాజేష్ స్థలం: సూర్యాపేట

సూర్యాపేట జిల్లాలోని తమ పూర్వీకుల గ్రామమైన తాటిపముల గ్రామంలో బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. పార్టీలకతీతంగా గ్రామస్తులు చూపిన ఆప్యాయతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యశ్వంత్ పూర్ వాగుపై రూ.16 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జి నిర్మాణ పనులను, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో రూ.7 కోట్లతో మంజూరైన పాఠశాల అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించారు.