జాతీయ క్రీడా పాలనా చట్టంపై బీసీసీఐ స్పష్టమైన వైఖరి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ముంబై

ముంబైలో జరిగిన బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జాతీయ క్రీడా పాలనా చట్టంపై చర్చ జరిగింది. క్రికెట్ అధికారికంగా నియమిత క్రీడగా నోటిఫై అయిన తర్వాతే చట్టాన్ని పాటిస్తామని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులు తీసుకోనందున బీసీసీఐపై ఆర్టీఐ చట్టం వర్తించదని, తాము వార్షికంగా మూడు వేల కోట్ల రూపాయల ఆదాయపు పన్ను చెల్లిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.