ఆసియా క్రీడల హాకీ సెమీస్లో భారత్ పాకిస్థాన్ పోరు

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

ఆసియా క్రీడల పురుషుల హాకీ సెమీఫైనల్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నట్లు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ తెలిపారు. లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత జట్టు ఫైనల్ చేరడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో గాయపడిన మిడ్ఫీల్డర్ రాజ్ కుమార్ పాల్ స్థానంలో నీలకంఠ శర్మ బరిలోకి దిగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్పై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది.