కృష్ణా డెల్టాకు జలవరంగా పట్టిసీమ ప్రాజెక్ట్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Amaravati
ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతి సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి కృష్ణా డెల్టా రైతులు మరియు సాగునీటి సంఘాల ప్రతినిధులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు నీరిస్తున్నందుకు సీఎంకు వారు ఘనంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టిసీమ ద్వారా ఐదు వందల టీఎంసీల గోదావరి నీటిని మళ్లించి రాష్ట్రానికి ఐదు వేల కోట్ల సంపద సృష్టించామని చంద్రబాబు స్పష్టం చేశారు.