వెలిగొండ నిర్వాసితులకు అందని పునరావాస ప్యాకేజీలు మరియు ఇళ్ల స్థలాలు
రిపోర్టర్: శివ
స్థలం: మార్కాపురం జిల్లా
వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు వదిలి నల్లమలసాగర్ జలాశయం నింపుతున్నప్పటికీ, మార్కాపురం జిల్లా గొట్టిపడియ వద్ద నిర్వాసిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో పునరావాసం అమలు కాలేదు. గెజిట్‌లో పేర్లు లేక, అర్హత ఉండి కూడా వెయ్యికి పైగా కుటుంబాలకు ప్యాకేజీ దక్కలేదు. ఇళ్ల పట్టాలు ఇచ్చినా చాలా మందికి స్థలాలు చూపకపోవడం, మౌలిక వసతులు కల్పించకపోవడంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.