తుఫాన్ గాలులకు నేలకూలిన ఎచ్చెర్ల మండల నీలగిరి చెట్లు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఎచ్చెర్ల
ఎచ్చెర్ల మండలంలోని సంతసీతారాంపురం పంచాయతీలో తుఫాన్ గాలులకు వందలాది నీలగిరి చెట్లు నేలకొరిగాయి. కోతకు వచ్చిన పంట దెబ్బతినడంతో ఎకరాకు రూ.50 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నీలగిరిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.