పాము కాటుకు వృద్ధుడు బలి: శ్రీకాకుళం జిల్లాలో విషాదకర ఘటన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన దేవాది కామినాయుడు పొలంలో గడ్డి కోస్తుండగా తాచుపాము కాటువేసింది. కుటుంబసభ్యులు వెంటనే పాలకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గత ఏడాది చిన్నకుమారుడు అనారోగ్యంతో మృతిచెందగా, తాజాగా తండ్రి కూడా పాము కాటుకు బలకావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.