స్థానిక సంస్థల ఎన్నికలపై బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన కీలక సమీక్ష
రిపోర్టర్: Bobbili GANESH
స్థలం: బొబ్బిలి
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న వర్క్‌షాప్‌లో భాగంగా, విజయనగరం జిల్లా ఇంచార్జ్ మంత్రి వంగలపూడి అనిత నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) పాల్గొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై మంత్రి అనితతో ఎమ్మెల్యే బేబీనాయన సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం, ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై ముఖ్యనేతలు ఈ సందర్భంగా కీలక సమాలోచనలు జరిపారు.