పల్నాడు జిల్లాలో బాలుడిపై అఘాయిత్యం నిందితులపై పోక్సో కేసు నమోదు

రిపోర్టర్: కిరణ్ స్థలం: పల్నాడు

పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెంలో ఎనిమిదేళ్ల బాలుడిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆడుకుందామని తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో ఈ అమానుషానికి ఒడిగట్టారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.