కొడుకు పేరును వెల్లడించిన టాలీవుడ్ హీరో నారా రోహిత్

రిపోర్టర్: అశోక్ స్థలం: తెలంగాణ

టాలీవుడ్ హీరో నారా రోహిత్, సిరిలెల్లా దంపతులు తమ కుమారుడి పేరును సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌లో జన్మించిన బాబుకు నందన్ రామ నారా అనే పేరు పెట్టినట్లు వారు తెలిపారు. నందన్ అంటే అంతులేని ఆనందాన్ని ఇచ్చేవాడని, తాతగారి జ్ఞాపకార్థం రామ అనే పేరును జోడించినట్లు పేర్కొంటూ కుటుంబంతో ఉన్న అందమైన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.