హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన ఆయుధపూజ
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని డీజీపీ కార్యాలయంలో సోమవారం దసరా పండుగ సందర్భంగా ఆయుధపూజ అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. దుర్గామాత ప్రత్యేక పూజలతో పాటు పోలీసు ఆయుధాలకు శాస్త్రోక్తంగా పూజలు చేసినట్లు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో డీఐజీ మహేష్ భగవత్‌తో పాటు ఏఐజీ అడ్మిన్ రమణ కుమార్, పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారని, ఈ పూజలు సిబ్బందిలో నూతన శక్తిని నింపుతాయని వివరించారు.