తిరుమలలో వైభవంగా శ్రీవారి గరుడసేవ నిర్వహణ
రిపోర్టర్: రాజేష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. గరుడ వాహనంపై కొలువుదీరిన శ్రీ మలయప్పస్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. గోవింద నామస్మరణలతో తిరుమాడ వీధులు మార్మోగాయి. ఈ పవిత్ర సేవలో పాల్గొనడం ఎంతో భక్తి భావాన్ని కలిగించిందని, స్వామివారి కృపాకటాక్షాలు ప్రతి భక్తునిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.