గుర్రంకొండలో హెచ్ఐవి నియంత్రణపై కళాజాత బృందం అవగాహన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: గుర్రంకొండ

గుర్రంకొండ బస్టాండ్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవి అవగాహన కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. రూరల్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ కళాజాత బృందం వీధినాటకాలు, ఇంద్రజాలాలు, జానపద గేయాల ద్వారా హెచ్ఐవి సోకే విధానం, నివారణ జాగ్రత్తలు, టోల్ ఫ్రీ నెంబర్ 1097 గురించి ప్రజలకు వివరించారు.