ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ సంచలనాత్మక మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు ఈడీ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ ద్రవ్య లావాదేవీలపై సీఐడీ కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు వీరిని రిమాండ్‌కు తరలించారు. కాగా, నిబంధనలకు లోబడి పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించడంతో శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి వీరు విడుదలయ్యే అవకాశం ఉంది.