పబ్బు రాజు గౌడ్ను పరామర్శించిన మాజీ చైర్మన్ వెన్రెడ్డి రాజు

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జీ పబ్బు రాజు గౌడ్ మాతృమూర్తి ఇటీవల పరమపదించారు. ఈ విషయమై సమాచారం అందుకున్న చౌటుప్పల్ మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, పబ్బు రాజు గౌడ్ నివాసానికి స్వయంగా చేరుకున్నారు. మాతృమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, రాజు గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి తీవ్ర సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో పబ్బు రాజు కుటుంబానికి తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.