పందిళ్లపల్లి ర్యాక్ పాయింట్‌కు భారీగా చేరిన యూరియా
రిపోర్టర్: Narendra kumar kinnera
స్థలం: చింతకాని
చింతకాని మండలంలోని పందిళ్లపల్లి ర్యాక్ పాయింట్‌కు గురువారం క్రిబ్కో కంపెనీకి చెందిన 1223 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకున్నట్లు ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య వెల్లడించారు. ఈ ఎరువులను వివిధ జిల్లాలకు కోటా ప్రకారం కేటాయించినట్లు తెలిపారు. ప్రైవేట్ డీలర్లు మరియు మార్క్‌ఫెడ్ ద్వారా రైతులకు పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఎరువుల కొరత తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.