కేబీసీ గేమ్ పేరుతో కోటిన్నర కాజేసిన సైబర్ కేటుగాళ్లు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: రుద్రప్రయాగ్

ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ ఉఖిమత్ ప్రాంతంలో కౌన్ బనేగా కరోడ్ పతి గేమ్ పేరుతో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. ఫేస్ బుక్ లో కేబీసీ గేమ్ లో జాయిన్ అయిన ఓ వ్యక్తికి భారీ నగదు, కారు బహుమతిగా వచ్చాయంటూ నమ్మించారు. వివిధ పన్నులు, రుసుముల పేరుతో జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య విడతల వారీగా అప్పులు చేసి మరీ రూ.1.5 కోట్లు చెల్లించిన బాధితుడు, మోసపోయానని గుర్తించి దేహ్రదూన్ సైబర్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.