విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఏపీ ఎమ్మార్పీఎస్ నేత గుండు పోగుల నేపాల్ డిమాండ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: మంత్రాలయం

మంత్రాలయం మండలంలోని చిలకలడోన గ్రామంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో కరెంట్ లేక దోమలు, విషపురుగుల భయంతో చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యపై విద్యుత్ శాఖ అధికారులను ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గుండు పోగుల నేపాల్ సంప్రదించి ఆరా తీశారు. గ్రామానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, లేకపోతే గ్రామస్తులతో కలిసి ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.