ఫార్మాసిటీలో కాలుష్య నియంత్రణ మండలి అధికారుల ఆకస్మిక తనిఖీలు
రిపోర్టర్: kadambari suhasini
స్థలం: గాజువాక
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో వ్యర్థాల విడుదలపై వచ్చిన వీడియోపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఏపీ పీసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి కాలుషిత నీటిని వదిలిన ఆరోపణలపై ఫార్మాసిటీ పరిధిలోని మొత్తం తొంభై ఐదు కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.