హైదరాబాద్ అభివృద్ధి వేగాన్ని ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో తాము సాధిస్తున్న అభివృద్ధి వేగాన్ని బ్లూమ్‌బెర్గ్ సంస్థ గుర్తించడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నగరంలో జరుగుతున్న సానుకూల మార్పులను అంతర్జాతీయ వేదికలపై ప్రశంసించడం రాష్ట్ర ప్రభుత్వ పాలనా పటిమకు నిదర్శనమన్నారు. ఈ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ఆయన స్పష్టం చేశారు.