ఏసీపీ దామోదర్ వేధింపులపై విజయవాడ సీపీకి వంశీ ఫిర్యాదు
రిపోర్టర్: నరేష్
స్థలం: విజయవాడ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసి సెంట్రల్ ఏసీపీ దామోదర్ తీరుపై ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో తనపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. తన లాయర్ సత్యశ్రీని ఏసీపీ ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని తెలిపారు. ఇలాంటి అధికారుల వల్లే పోలీసు వ్యవస్థపై తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు.