విశాఖ ఆర్కే బీచ్‌లో స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

రిపోర్టర్: వెంకట్ స్థలం: విశాఖపట్నం

స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం ఆర్కే బీచ్‌ తీరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా బీచ్‌ పరిసరాల్లో చిరు వ్యాపారం చేస్తున్న అట్టాడ నాగమణిని పలకరించి ఆమె తయారు చేసిన మూరీ మిక్చర్‌ను రుచి చూశారు. విడాకులు తీసుకుని జీవనోపాధి లేదని ఆమె తన పరిస్థితిని వివరించగా వెంటనే స్పందించిన సీఎం ఒంటరి మహిళ పింఛను అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.