ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కోసం శరవేగంగా కొనసాగుతున్న భారీ భూసేకరణ ప్రక్రియ
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
అదిలాబాదులో విమానాశ్రయం ఏర్పాటు కోసం వివిధ గ్రామాల వారీగా అధికారులు భూసేకరణ ప్రక్రియను ముమ్మరం చేశారు. అర్లీ-బి గ్రామంలో నూట అరవై ఎకరాలు, కచ్ కంటిలో ఇరవై తొమ్మిది ఎకరాలు, టాక్లిలో ఐదు ఎకరాలు, అనుకుంటాలో ఎనిమిది వందల ఎకరాలకు పైగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఖానాపూర్ మరియు నిశాన్ గాట్ గ్రామాలలో కూడా భూసేకరణకు సంబంధించిన అధికారిక ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.