బొబ్బిలి బ్రహ్మ కుమారీస్ లో ఘనంగా టీచర్స్ డే సెలబ్రేషన్...! బ్రహ్మకుమారి సెంటర్ ఇంచార్జ్ - రాజేశ్వరి అక్కయ్య..!

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా...

బొబ్బిలి...

ఆంద్ర ప్రదేశ్, విజయనగరం జిల్లా, బొబ్బిలి లో ప్రజా పిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం వారు ఆదివారం నిర్వహించిన టీచర్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమం జగన్నాధ పురం టీచర్స్ కాలనీ లో పరమాత్మ అనుభూతి ధాం మెడిటేషన్ ఆడిటోరియం లో బ్రహ్మకుమారి సెంటర్ ఇన్చార్జ్ బీకే రాజేశ్వరి అక్కయ్య ఆధ్వర్యంలో టీచర్స్ డే సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు. బొబ్బిలి కేంద్రం లో ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును నింపే దైవ స్వరూపులు మన ఉపాధ్యాయులు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ' అని మన సంస్కృతి గురువుకు దేవుడికంటే ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చింది.

అక్షరాలు నేర్పడం దగ్గర నుంచి జీవితంలో ఎలా నిలబడాలో నేర్పించేంత వరకు ప్రతి అడుగులోనూ మనల్ని నడిపించేది. ఉపాధ్యాయులే. తల్లిదండ్రులు జన్మనిస్తే, ఆ జన్మకు సార్థకతను, ఒక లక్ష్యాన్ని ప్రసాదించేది మన గురువులు. మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తూ, మన ఆశయాలకు రెక్కలు తొడిగే ప్రతి గురువుకూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని బావోద్వేగమైన ప్రసంగాన్ని ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులందరితో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ రాజేశ్వరి అక్కయ్య చేయించారు. ఈ కార్యక్రమం లో టీచర్స్ పాల్గొన్నారు, బ్రహ్మ కుమారీస్ చేస్తున్న సేవలను కొనియాడారు.