వెదురుకుప్పం మండలం గంటావారిపల్లిలో రోడ్డు కోసం ఎన్నికల బహిష్కరణ హెచ్చరిక
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వెదురుకుప్పం
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం గంటావారిపల్లి ముటాల గ్రామస్థులు రోడ్డు సమస్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఎమ్మెల్యే థామస్‌పై మండిపడ్డారు. వర్షాలకు వాగులు పొంగి రాకపోకలు నిలిచిపోతున్నాయని ఆవేదన చెందారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని, ప్రచారానికి వచ్చే నాయకులను అడ్డుకుంటామని ఖరాఖండీగా హెచ్చరించారు.