'రివర్షన్‌ల ద్వారానే నియామకాలు': గృహనిర్మాణ శాఖ కీలక ఉత్తర్వులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
కార్పొరేషన్ల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా, గృహనిర్మాణ సంస్థలో తిరిగి విధుల్లో చేరేందుకు సమ్మతి తెలిపిన రిటైర్డ్ ఉద్యోగుల సర్దుబాటుపై అనిశ్చితి వీడింది. అమరావతిలో గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. నిబంధనలకు అనుగుణంగా ఇప్పటికే ఆయా పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న వారిని రివర్షన్ చేసి, వారి స్థానంలో సీనియారిటీ ప్రాతిపదికన రిటైరైన ఉద్యోగులను నియమించేలా అధికారులు చర్యలు చేపట్టారు.