బొంబై హైకోర్టులో నటుడు ఇమ్రాన్ ఖాన్ బేషరతు క్షమాపణ
రిపోర్టర్: రాము
స్థలం: ముంబై
ఓటర్ల జాబితా సవరణ నిరసనలో పాల్గొనడంపై బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టులో బేషరతుగా క్షమాపణలు చెప్పారని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ధర్నాలలో పాల్గొనబోనని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. ఓసీఐ కార్డు కలిగిన విదేశీ పౌరుడిగా ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శించడం ఆమోదయోగ్యం కాదని, క్షమాపణలు చెప్పినంత మాత్రాన మినహాయింపు ఇవ్వలేమని ఉన్నతన్యాయస్థానం స్పష్టం చేసింది.