తండ్రిని దారుణంగా హత్య చేసిన కొడుకు అరెస్టు
రిపోర్టర్: RAVI BABU
స్థలం: వెదురుకుప్పం
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఒక్క రోజులోనే అరెస్టు చేశారు. మద్యపాన అలవాటు, అప్పులపై మందలిస్తాడనే కోపంతో కొడుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
నిందితుడు S. జోకేష్ రెడ్డి తన తండ్రి S. చెంగా రెడ్డిని కోడి కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, నిందితుడిని అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.