ప్రాణాంతక సైలెంట్ కిల్లర్: థ్రాంబోసిస్ లక్షణాలు వివరిస్తున్న వైద్య నిపుణులు
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
దగ్గు, అలసట, కాళ్ల నొప్పులు వంటి సమస్యలను తేలికగా తీసుకోవద్దని, ఇవి ప్రాణాంతక థ్రాంబోసిస్ ముప్పును సూచిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి గాయాలు లేకుండా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని థ్రాంబోసిస్ అంటారని వైద్యులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరియు బ్రెయిన్ స్ట్రోక్ మరణాలకు బ్లడ్ క్లాట్స్ ప్రధాన కారణమని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సైలెంట్ కిల్లర్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.