భారత్‌లో శామ్‌సంగ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం
రిపోర్టర్: సునీల్
స్థలం: India
స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలో అమ్మకాలు మందగించడం, మెమరీ చిప్ ధరలు భారీగా పెరగడంతో శామ్‌సంగ్ ఇండియా ఉద్యోగుల తొలగింపును ప్రారంభించింది. ఇప్పటికే టెలివిజన్, హోమ్ అప్లయెన్సెస్ విభాగాల్లో 80 నుండి 100 మంది ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. విక్రయాలు, మార్కెటింగ్ సిబ్బందిలో దాదాపు 25 శాతం మందిపై ప్రభావం పడే అవకాశం ఉంది.