ఏఎంఆర్ అధినేత మహేశ్ రెడ్డి నివాసాలపై ఈడీ సోదాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మైనింగ్, కన్స్ట్రక్షన్ సంస్థ ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఎ. మహేశ్ రెడ్డి నివాసాలు మరియు కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన నిధుల మళ్లింపు ఆరోపణలతో ఈ సోదాలు చేపట్టారు. కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కుమారుడి సినిమా విడుదల వేళ ఈ రైడ్స్ జరగడం కలకలం రేపింది.