పెద్దపల్లి జిల్లాలో ప్రేమ పేరుతో యువతిని హత్య చేసిన లెక్చరర్

రిపోర్టర్: హరి స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రేమ పేరుతో నమ్మించి యువతికి పురుగు మందు తాగించి హత్య చేసిన ఘటనలో కాంట్రాక్టు లెక్చరర్ నవీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అక్షితరాణి అనే యువతి మరొకరితో చనువుగా ఉంటోందన్న కక్షతో లెక్చరర్ ఈ ఘాతుకానికి పాల్పడి, నేరం మరొకరిపై నెట్టేందుకు సూసైడ్ నోట్ రాయించినట్లు డీసీపీ రాంరెడ్డి తెలిపారు.