తమిళనాడులో ఉపాహార పథకం విస్తరణను ప్రారంభించిన సీఎం విజయ్
రిపోర్టర్: మహేష్
స్థలం: తమిళనాడు
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం చెన్నైలోని తిరువాన్మియూర్ గాంధీ గ్రామం కార్పొరేషన్ పాఠశాలలో పెరుంతలైవర్ కామరాజర్ ఉపాహార పథకం విస్తరణను అధికారికంగా ప్రారంభించారు. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఉద్దేశించిన ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 15,454 పాఠశాలల్లోని దాదాపు 15.3 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం విజయ్ విద్యార్థులతో కలిసి స్వయంగా అల్పాహారం చేశారు.