జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ఐ వాలీబాల్ క్రీడలకు ఎంపికైన ఆమనగల్లు విద్యార్థులు
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లు పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో నిర్వహించిన వాలీబాల్ పోటీలలో వివేక విద్యా భారతి హైస్కూల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ఐ క్రీడలకు ఎంపికయ్యారు. అండర్-17 విభాగంలో ముగ్గురు, అండర్-14 విభాగంలో ముగ్గురు విద్యార్థులు ప్రతిభ చాటారు. గత మూడు సంవత్సరాలుగా ఈ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాణిస్తూ పతకాలు సాధిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.