సివిల్ సర్వీసుల్లో పెండింగ్ ఖాళీలపై కేంద్రానికి డాక్టర్ శివప్రసాద్ లేఖ

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

సివిల్ సర్వీసుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసి దేశంలో పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయాలని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకని శివప్రసాద్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు వేల సంఖ్యలో ఖాళీగా ఉండటం వల్ల అధికారులపై తీవ్ర పనిభారం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణతో సహా అనేక రాష్ట్రాల్లో ఈ కొరత ప్రజా సేవలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని తెలిపారు. వెంటనే సమగ్ర క్యాడర్ సమీక్ష చేపట్టి ఖాళీలను నిర్ణీత కాలపరిమితిలో భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.