నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు!
రిపోర్టర్: సునీల్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. వివిధ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లను విడుదల చేసింది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎండోమెంట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్లు సహా పలు కీలక పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.