హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలపై కేబినెట్ సబ్-కమిటీ సమీక్ష

రిపోర్టర్: శివ స్థలం: సూర్యాపేట

హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ 2026 సన్నాహాలు, అభివృద్ధి పురోగతిపై కేబినెట్ సబ్-కమిటీ సమావేశం నిర్వహించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 7 నుండి 9 తేదీల వరకు జరగనున్న ఈ సదస్సు ఏర్పాట్లపై మంత్రులు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా వివరాలు పంచుకున్నారు.