జహీరాబాద్లో యువతి అనుమానాస్పదంగా మిస్సింగ్: కేసు నమోదు చేసిన పోలీసులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని కాంతరెడ్డి కాలనీకి చెందిన పోతల హారిక అనే 21 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయింది. 'నేను వెళ్ళిపోతున్నా, నాకోసం వెతకవద్దు' అని వాట్సాప్లో మెసేజ్ చేసి ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మేనమామ శివరాజ్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఎస్ఐ లవా కుమార్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరాలను వెల్లడించారు. దర్యాప్తు వేగవంతమైంది.