ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం విశాఖవాసులు మృతి

రిపోర్టర్: విజయ్ స్థలం: విశాఖపట్నం

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో జరిగిన ఘోర కార్ ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన అత్త, కోడలు దుర్మరణం చెందారు. శుభకార్యం నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లిన జిటి ప్రసాద్ కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆయన కళ్లెదుటే భార్య, కోడలు నేహా ప్రాణాలు కోల్పోగా, డ్రైవర్ కు గాయాలయ్యాయి. విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ వర్గాల్లో ఈ వార్త తీవ్ర విషాదం నింపింది.