విద్యుత్ కోతలతో అన్నదాతలను ఇబ్బంది పెడితే ఊరుకోమంటూ సీపీఎం హెచ్చరిక

రిపోర్టర్: శివ స్థలం: నల్గొండ

వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో చిట్యాల మండలం వెలిమినేడు సబ్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించినట్లు సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అరూరి శ్రీను తెలిపారు. కరువు పరిస్థితుల్లో వరి పంటలకు నీరు అందించే సమయంలో కోతలు విధిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.