అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రిపోర్టర్: నరేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను నామమాత్రంగా కాకుండా ప్రజలకు సంతృప్తి కలిగేలా పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులు పరిశీలించాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఏఐ, టెక్నాలజీ వినియోగం పెంచాలని స్పష్టం చేశారు. పనితీరు మెరుగ్గా లేని వారిని పక్కన పెడతామని హెచ్చరించారు.